Telangana Rains: తెలంగాణలో ఇటీవల కుంభవృష్టి కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి ఆదివారం మళ్లీ భూమిపైకి వచ్చింది. సాయంత్రం ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో సోమవారం భారీగా, మంగళవారం ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో తగ్గిన వర్షాలు 16 నుంచి మళ్లీ పుంజుకున్నాయి.
తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలున్నాయ్.. !! - Telangana weather report
Telangana Rains:తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా తీరంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు