ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో.. తెలంగాణ సరిహద్దుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల దాడులతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
పోలీసు యంత్రాంగం అప్రమత్తం.. సరిద్దుహల్లో తనిఖీలు ముమ్మరం - police cumbing in bhupalpally
ఛత్తీస్గఢ్ దండకారుణ్యంలో మారణకాండ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ పోలీసు బలగాలు సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
పోలీసు యంత్రాంగం అప్రమత్తం .. సరిద్దుల్లో తనిఖీలు ముమ్మరం
మహదేవపూర్ సర్కిల్లోని మహదేవపూర్, కాళేశ్వరం, పలిమేల పోలీస్ స్టేషన్ పరిధిలో గాలింపు ముమ్మరం చేశారు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
- ఇదీ చదవండి :నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?