ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FlyOver: హైదరాబాద్​లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - telangana municipal minister ktr

నిత్యం ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతోన్న భాగ్యనగరవాసులకు కాస్త ఊరట కలగనుంది. లింక్​ రోడ్లు, ఫ్లై ఓవర్ల(FlyOver)తో రద్దీ తగ్గి ప్రయాణం సులభం కానుంది. ఇప్పటికే పలు లింక్ రోడ్లు, ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బాలానగర్​లోని ఫ్లైఓవర్(FlyOver)​ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

telangana-municipal
telangana-municipal

By

Published : Jul 6, 2021, 12:15 PM IST

హైదరాబాద్​లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్​లోని బాలానగర్ ఫ్లైఓవర్(FlyOver) అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని తట్టుకునేలా ఎస్​ఆర్​డీపీ పథకంలో భాగంగా ఈ పైవంతెన(FlyOver)ను నిర్మించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. బాలానగర్ ఫ్లైఓవర్(FlyOver)​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి పాల్గొన్నారు. నగరంలో తొలిసారిగా 6లేన్లతో ఈ ఫ్లైఓవర్​ను నిర్మించారు.

బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తా... రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్ , జీడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలకు తీర్చేందుకు ఫ్లై ఓవర్(FlyOver) నిర్మించారు.

2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 385 కోట్ల రూపాయలతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్‌, మరొకటి బాలానగర్‌. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి . దీంతో నిత్యం కార్మికులు, లారీలు , ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ పైవంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్‌ రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details