Talasani on theatres: సినీ పరిశ్రమపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ సమస్యలపై సత్వరమే స్పందిస్తున్నామని.. ఈ రంగంపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు మరింత ఉద్ధృతంగా ఉంటే ఆంక్షలు తప్పవన్నారు. త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
సినీ పరిశ్రమ పుంజుకుంది