Minister Satyavathi's Father Passes Away :తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు.
Minister Satyavathi's Father Passes Away: తెలంగాణ మంత్రి సత్యవతి రాఠోడ్కు పితృవియోగం - మంత్రి సత్యవతి రాఠోడ్ తండ్రి మృతి
Minister Satyavathi's Father Passes Away : తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న మంత్రి.. మేడారం పర్యటన నుంచి బయలుదేరారు.
తెలంగాణ మంత్రి సత్యవతి రాఠోడ్కు పితృవియోగం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఉన్న సత్యవతి రాఠోడ్.. తండ్రి మరణవార్త తెలిసి అక్కణ్నుంచి తిరుగు పయనమయ్యారు. మంత్రి సత్యవతి తండ్రి మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. కేసీఆర్ సత్యవతి రాఠోడ్ను ఫోన్లో పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.