ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో తమకు సత్సంబంధాలున్నాయని తెలంగాణ మంత్రి కేటీ రామారావు తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 'ఆస్క్ కేటీఆర్' పేరిట ఆదివారం ట్విటర్ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
కృష్ణా జలాల్లో చట్టబద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.