Srikanthachari Father missing: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి(55) అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. హయత్‌నగర్ పరిధిలోని సూర్యనగర్ కాలనీ రోడ్డు నంబర్-8లో వెంకటాచారి ఆయన భార్య శంకరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు.
శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం.. ఆయన వద్దే ఉండొచ్చు..! - శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం
Srikanthachari Father missing: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి(55) అదృశ్యమైనట్లు హయత్‌నగర్ పీఎస్లో కేసు నమోదైంది. జూన్ 1న మధ్యాహ్నం పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని ఆయన భార్య శంకరమ్మ పోలీసులకు తెలిపింది.
1
'జూన్ 1న మధ్యాహ్నం పనిట నిమిత్తం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు తన భర్త సామాజిక మాధ్యమాల్లో కనిపించాడని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు' అని శంకరమ్మ పోలీసులకు వెల్లడించింది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్ద ఆశ్రయం పొందుతుండొచ్చని శంకరమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: