ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐదు రోజుల పాటు తెలంగాణ శాసనమండలి సమావేశాలు

తెలంగాణ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 17 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనమండలి బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా... 20,22 తేదీల్లో దాని మీద చర్చ ఉంటుంది.

ఐదు రోజుల పాటు తెలంగాణ శాసనమండలి సమావేశాలు
ఐదు రోజుల పాటు తెలంగాణ శాసనమండలి సమావేశాలు

By

Published : Mar 16, 2021, 12:15 AM IST

తెలంగాణ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈనెల 17, 18, 20, 22, 26 తేదీల్లో మండలి సమావేశాలు నిర్వహించేలా... మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ నిర్ణయం తీసుకుంది.

ఈనెల 17వ తేదీన సాధారణ చర్చ జరగనుండగా... 18వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం, 20, 22 తేదీల్లో బడ్జెట్​పై చర్చ, 26వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంతో సమావేశాలు ముగియనున్నాయి. బీఏసీ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఛీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ హాజరయ్యారు.

ఇదీ చూడండి:అదృశ్యమైన బాలుడు.. ఇంటికి సమీపంలోనే విగతజీవిగా!

ABOUT THE AUTHOR

...view details