TS Intermediate Results 2022: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాలను జూన్ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తైనందున తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తామన్నారు జలీల్.
ఈ నెల 28న తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల - ts inter results 2022
TS Intermediate Results 2022: తెలంగాణలో ఈ నెల 28న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జవాబు పత్రాల మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన సందర్భంగా తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
inter board
ఈ క్రమంలో జూన్ 28న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలిపారు. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించారు.
ఇవీ చూడండి: