తెలంగాణ ఇంటర్ బోర్డు... విద్యాసంవత్సరం షెడ్యూల్ను ఖరారుచేసింది. ఈ ఏడాది పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసిన అధికారులు.... అర్ధ సంవత్సరం, ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో 220 పనిదినాలు ఉండనున్నాయి. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, జనవరి 13 నుంచి 15 వరకు 3 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు జరగనుండగా... ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ఇంటర్ ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు, మే చివరి వారంలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అనంతరం... జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి.