తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు(Ts Inter 1st year Exams time table ) అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. 2020-21 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే వారంతా ప్రమోట్ అయ్యారు. పరిస్థితులు అనుకూలించిన తరవాత మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల టైం టేబుల్(Inter 1st year Exams time table)ను ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం విడుదల చేశారు. తొలుత ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
TS Inter 1st year Exams: అక్టోబరు 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు - telangana Inter first year exams will start from October twenty fifth
తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం(TS Inter 1st year Exams) పరీక్షలకు.. ఇంటర్ బోర్డు తేదీ ఖరారు చేసింది. కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు.. కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. అక్టోబరు 25 నుంచి నవంబరు 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
మాస్కు తప్పనిసరి
విద్యార్థులు, సిబ్బంది మాస్కును తప్పనిసరిగా ధరించి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాలని, భౌతికదూరం పాటించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. టీకా వేయించుకున్న వారినే విధుల్లో నియమిస్తారు. బెంచీలు, డెస్కులు, తలుపులు, కిటికీలను శానిటైజ్ చేస్తారు. ప్రతీ కేంద్రంలో(covid precautions at Exams) ఒకట్రెండు ఐసొలేషన్ గదుల్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక స్టాఫ్ నర్సు గానీ ఏఎన్‌ఎం గానీ అందుబాటులో ఉంచుతారు.