ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS HC ON IAS SRILAKSHMI: శ్రీలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు - ias srilakshmi case

ఓబుళాపురం గనుల వ్యవహారంలో సీబీఐ కోర్టు విచారణను నిలిపివేయాలంటూ.. ఐఏఎస్​ అధికారిని శ్రీలక్ష్మి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. చట్టాల ఉల్లంఘన లేనంత వరకు దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది.

TS HC ON IAS SRILAKSHMI
TS HC ON IAS SRILAKSHMI

By

Published : Sep 24, 2021, 3:04 AM IST

ఓబుళాపురం గనుల వ్యవహారంలో సరిహద్దుల వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు.. సీబీఐ కోర్టులో విచారణ నిలిపివేయాలన్న ఐఏఎస్​ అధికారిని శ్రీలక్ష్మి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు(TELANGANA HIGHCOURT ON SRILAKSHMI CASE) తోసిపుచ్చింది. ఓబుళాపురం గనుల కేసు నమోదై తొమ్మిదేళ్లయినా.. ఇంకా ప్రాథమిక దశ దాటలేదని హైకోర్టు పేర్కొంది. స్వల్ప కారణాలతో విచారణ అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. విచారణ కొనసాగింపు దర్యాప్తు సంస్థల విచక్షణ అని.. నిర్దిష్ట కోణాల్లో దర్యాప్తు చేయాలని నిందితులు చెప్పడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పులో స్పష్టం చేసింది. చట్టాల ఉల్లంఘన లేనంత వరకు దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ కోర్టులో విచారణ ఆపాలన్న శ్రీలక్ష్మి అభ్యర్థన ఆమోదయాగ్యంగా లేదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున.. సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల ప్రక్రియ కొంతకాలంగా నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details