ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్​ - ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్‌లో వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లకు రక్షణ కిట్లు ఇచ్చారా అని ప్రశ్నించింది. ఒకవేళ పీపీఈ కిట్లు ఇస్తే వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందని ప్రశ్నించింది. జూన్ 8లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

telangana-high-court-serious-on-kcr-government-because-of-the-doctors-were-given-ppe-kits
పీపీఈ కిట్లు ఇచ్చారా? ఇస్తే ఎలా వ్యాధి సోకిందో చెప్పండి

By

Published : Jun 4, 2020, 7:14 PM IST

ఆస్పత్రుల్లో రక్షణ కిట్లు ఇచ్చినట్లయితే.. వైద్యులకు కరోనా ఎందుకు సోకిందో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాప్తి, పరీక్షలపై విశ్రాంత డీఎంహెచ్ఓ రాజేందర్, విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన ఏడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

ఉస్మానియా, నిమ్స్ తదితర ఆస్పత్రుల్లోని 37 మంది వైద్యులకు కరోనా సోకిందని వివరించారు. వైద్య సిబ్బంది అందరికీ కరోనా రక్షణ కిట్లు ఇచ్చినట్లు గతంలో ప్రభుత్వం నివేదించిందని.. అలాంటప్పుడు వైద్యులకు కరోనా ఎలా సోకిందని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరి ద్వారా వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందో నిర్ధారించారా అని అడిగింది. పూర్తి వివరాలతో ఈనెల 8లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details