ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా విపత్తు వేళ ఐఏఎస్‌లతో భూములపై విచారణా? : తెలంగాణ హైకోర్టు

దేవరయాంజల్ భూముల విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై.. ఇప్పుడే ఇంత తొందరగా విచారణ ఎందుకు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, దేవాదాయశాఖకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.

By

Published : May 8, 2021, 4:38 PM IST

Published : May 8, 2021, 4:38 PM IST

telangana high court
telangana high court

దేవరయాంజల్ భూములపై ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై... ఇప్పుడే ఇంత తొందరగా విచారణ ఎందుకు చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు... ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన... ఈ అంశంపై ఎందుకని నిలదీసింది. కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా...? అని ప్రభుత్వాన్ని అడిగింది.

ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారమే చర్యలు ఉంటాయని.. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవన్నారు. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ముందు నోటీసులు ఇవ్వాలని కమిటీని ఆదేశించిన హైకోర్టు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరించాలని సూచించింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, దేవాదాయశాఖకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details