ts high court: విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై విచారణ.. తీర్పు రిజర్వ్ - ts high court hearing on jagati publications case
15:13 July 23
విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ
విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. మొదట సీబీఐ కేసులు లేదా రెండూ ఒకేసారి విచారించాలని వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని స్పష్టం చేశారు. మనీలాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని.. ఇందుకు సంబంధించిన అభియోగాలపై విచారణ జరపాలని కోరారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా విచారణ జరపాలని చెప్పారు. ఈడీ ఛార్జిషీట్లపై విచారణ జరపాలని అదనపు సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి
NGT: రాయలసీమ ఎత్తిపోతలపై తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం