తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సచివాలయం కూల్చివేత పనులు నిలిపివేయండి: తెలంగాణ హైకోర్టు ఆదేశం
తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంతంలో కొత్త నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని సర్కార్ భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో ప్రభుత్వం కూల్చివేత ప్రారంభించింది. అయితే తాజా ఆదేశాలతో కూల్చివేత పనులు నిలిచిపోనున్నాయి.
ఇదీచదవండి.