తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ చేపట్టింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్ వేసిన పిటిషన్‌పై చర్చించింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని సూచించింది. నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యానికి గురవుతుందన్న పిటిషన్‌పై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
HIGH COURT: గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు కీలక సూచనలు.. ఆంక్షలు! - హైకోర్టు వార్తలు
తెలంగాణలోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు ఉండాలని ఆదేశించింది.
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని న్యాయస్థానం తెలిపింది. ప్రజల సెంటిమెంట్‌తో పాటు, ప్రస్తుత పరిస్థితులూ చూడాలని... వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. అందరి సూచనలు పరిశీలించి ఈనెల 6వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:MINISTER KTR: మంత్రి కేటీఆర్‌కు ప్రముఖ దర్శకుడి ట్వీట్... అధికారుల రియాక్షన్!