ONLINE CLASSES IN TELANGANA: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని సూచించింది.
''ఫిబ్రవరి 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు.. ఆన్‌లైన్ బోధన కొనసాగించండి. హైదరాబాద్లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాల్సిందే. సమ్మక్క జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయండి. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత' - తెలంగాణ హైకోర్టు
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని పాజిటివిటీ రేటు 3.40శాతం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీలో 4.64 శాతం, మేడ్చల్‌లో 3.76 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు.