ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలోని 33 జిల్లాలకు.. పోర్ట్‌ఫోలియో జడ్జిల కేటాయింపు - 33 జిల్లాలకు పోర్ట్‌ఫోలియో జడ్జీల కేటాయింపు

Judges to new district: తెలంగాణలో 33 కొత్త జిల్లా కోర్టులకు న్యాయాధికారులను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 27 మంది హైకోర్టు జడ్జిలను 33 జిల్లాల న్యాయ పరిపాలన వ్యవహారాలను చూసుకునేందుకు నియమించారు. కొంత మంది న్యాయమూర్తులకు రెండు జిల్లాలను కేటాయించారు.

District Portfolio Judges
పోర్ట్‌ఫోలియో జడ్జిల కేటాయింపు

By

Published : Jun 1, 2022, 8:38 AM IST

Judges to new district: కొత్త కోర్టులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 33 జిల్లాలకు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జిలుగా హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్‌ జనరల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పాత జిల్లాలకు అనుగుణంగానే జిల్లా కోర్టులున్నాయి. రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా ఇటీవల కోర్టుల విభజన జరిగింది. రేపటి నుంచి 33 జిల్లా కోర్టులు పనిచేయనున్నాయి.

ఈ మేరకు జిల్లా జడ్జీలు, అదనపు జడ్జీలు, సీనియర్‌ సివిల్‌ జడ్జీలను జిల్లా కోర్టులకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 27 మంది హైకోర్టు జడ్జీలను 33 జిల్లాల న్యాయ పరిపాలన వ్యవహారాలను చూసుకునేందుకు నియమించారు. కొంత మంది న్యాయమూర్తులకు రెండు జిల్లాలను కేటాయించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details