రుణ యాప్‌ల నిర్వాహకుల ఆటలు కట్టించేలా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లోన్ యాప్‌లు బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. యాప్‌ల తొలగింపునకు ప్లే స్టోర్లను సంప్రదించాలని డీజీపీకి హైకోర్టు నిర్దేశం చేసింది. న్యాయవాది కల్యాణ్ దీప్ దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
దా'రుణ'యాప్‌లను తొలగించండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం - High Court orders removal of loan applications
రుణ యాప్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లోన్ యాప్ లు బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
రుణ యాప్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
చైనా లోన్ యాప్‌ల వేధింపులతో రుణాలు పొందినవాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. రుణ యాప్‌ల నిర్వాహకుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది