జగన్ అక్రమాస్తుల కేసుల్లోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్ విచారణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టు తనపై అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన అభియోగాలను విచారణకు స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ... విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. బీపీ ఆచార్య ఏపీఐఐసీ సీఎండీగా ఉన్నప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగం మోపింది. లేపాక్షి ఇష్యూలో బీపీ ఆచార్యను నిందితుడిగా చేర్చి 2013లో ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అభియోగాలను మోపింది.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్‌పై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ - Lepakshi Knowledge Hub chargesheet news
సీబీఐ కోర్టులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్‌పై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో బీపీ ఆచార్య పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషన్‌పై విచారణను జూన్ 7కి వాయిదా వేసింది.
అయితే పీసీ చట్టం కింద అభియోగాల నమోదుకు అప్పుడు కేంద్రం నుంచి అనుమతి లేకపోవడంతో.. న్యాయస్థానం ఐపీసీ అభియోగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. కేంద్రం 2016లో అనుమతివ్వడంతో అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. సీబీఐ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం మార్చి 10న బీపీ ఆచార్యపై అవినీతి నిరోధక చట్టంలోని 'సెక్షన్ 13 క్లాజ్ 2 రెడ్ విత్ 13 వన్ డీ' కింద అభియోగాలను విచారణకు స్వీకరించింది. తనపై పీసీ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ తేలే వరకూ సీబీఐ కోర్టులో విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు.. విచారణను జూన్ 7కి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'