సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ పై ఈడీ కేసు విచారణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. జగన్ కంపెనీల్లో 140 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఇండియా సిమెంట్స్‌కు.. వైఎస్ సర్కారు క్విడ్ ప్రోకోగా కృష్ణా జలాలను కేటాయించిందని సీబీఐ తెలిపింది. సీబీఐ అభియోగపత్రం ఆధారంగా విచారణ జరిపిన ఈడీ.. ఇండియా సిమెంట్స్ ఆస్తులను ప్రాథమికంగా జప్తు చేసి.. ఎన్.శ్రీనివాసన్ తదితరులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది.
జగన్ ఆస్తుల కేసు: శ్రీనివాసన్‌కు తెలంగాణ హైకోర్టు స్టే నిరాకరణ - జగన్ అక్రమాస్తుల కేసుపై వార్తలు
సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ ఈడీ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టు స్టే నిరాకరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఎన్.శ్రీనివాసన్‌కు తెలంగాణ హైకోర్టు స్టే నిరాకరణ
తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాసన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. 75 ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆ అభ్యర్థననూ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చి.. విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : దేశాన్ని బలహీన పరిచేలా చట్టాలు చేస్తున్నారు: ఓవైసీ
Last Updated : Feb 19, 2020, 7:28 AM IST