సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు సినీ నటుడు పవన్ కల్యాణ్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. కళాకారుడికి ఆయన సహాయం ఎంతో స్పూర్తిదాయకమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమన్నారు. ఈ మేరకు గవర్నర్ పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
GOVERNOR TAMILISAI: పవన్ కల్యాణ్‌ను అభినందించిన తెలంగాణ గవర్నర్
సినీనటుడు పవన్ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు రెండు లక్షలు సహాయం చేసి ఆదుకోవడం హర్షణీయమని ఆమె ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్‌ను అభినందించిన తెలంగాణ గవర్నర్