ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేనూ స్కౌట్స్​ స్టూడెంట్​నే: తెలంగాణ గవర్నర్​ - SCOUTS AND GUIDES SCHOOL ANNIVERSERY

హైదరాబాద్​ దోమలగూడలోని స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ పాఠశాలను తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​ సందర్శించారు. మాజీ ఎంపీ కవితతో కలిసి యూనిఫామ్​లో పాఠశాలకు విచ్చేశారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. తానూ స్కౌట్స్​ అండ్​ గైడ్స్ విద్యార్థినే అని తెలిపారు.

తెలంగాణ గవర్నర్​

By

Published : Nov 7, 2019, 11:05 PM IST

నేనూ స్కౌట్స్​ అండ్​ గైడ్స్​ స్టూడెంట్​నే: తెలంగాణ గవర్నర్​

సమాజం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ దోమలగూడలోని పాఠశాలను మాజీ ఎంపీ కవితతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. 8 మంది విద్యార్థులకు రాజ్య పురస్కారాలు ప్రదానం చేశారు. తాను కూడా... స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినే అని గవర్నర్​ పేర్కొన్నారు. తనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్​ను పంపించినందుకు మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ తమిళిసై... స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలను సందర్శించడం సంతోషంగా ఉందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు... ప్రస్తుతం 590 మంది విద్యార్థులు ఉన్నారని కవిత వివరించారు.

ABOUT THE AUTHOR

...view details