Bharat Biotech: భారత్ బయోటెక్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. కొవిడ్ నివారణ కోసం నాజల్ డ్రాప్స్‌ను తీసుకొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో డీ.ఈ.షా (D.E SHAW) కంపెనీ విరాళంగా అందించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను గవర్నర్ ప్రారంభించారు. పేదలకు నిస్వార్థంగా సేవలు అందిస్తోన్న దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా డీ.ఈ.షా కంపెనీని అభినందించారు.
కొవిడ్ రెండో వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న దేశం.. ప్రస్తుతం స్వయం సమృద్ధి సాధించిందన్నారు. మోదీ నేతృత్వంలో ఆక్సిజన్ ఉత్పత్తి రెట్టింపైందని గవర్నర్ అన్నారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి, తయారీలోనూ దేశం అత్యంత విజయవంతమైందని ప్రశంసించారు.