ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నవతరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: తెలంగాణ గవర్నర్‌ - Anjana sarja latest news

Tamilisai Launched Sarja Eco Friendly Handbags :పారిశ్రామిక రంగంలోకి యువతరం రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని, వారిని ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్రముఖ సినీ నటుడు అర్జున్‌ కుమార్తె అంజనా సర్జా.. ‘సర్జా డిజైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో పర్యావరణహిత ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగు పెట్టారు. పండ్లు, కూరగాయల వ్యర్థాలతో తయారు చేసిన హ్యాండ్‌బ్యాగులను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం విడుదల చేశారు. వ్యాపార రంగంలో కుమార్తెను ప్రోత్సహిస్తున్నందుకు అర్జున్‌ కుటుంబ సభ్యులను అభినందించారు.

TG Governor
పారిశ్రామిక రంగంలోకి యువతరం

By

Published : Sep 9, 2022, 2:22 PM IST

పారిశ్రామిక రంగంలోకి యువతరం

Tamilisai Launched Sarja Eco Friendly Handbags : ప్రముఖ సినీ నటుడు అర్జున్‌ కుమార్తె...అంజనా సర్జా... సర్జా డిజైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ పేరుతో పర్యావరణ హిత ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. పండ్లు, కూరగాయల వ్యర్థాలతో చేతిసంచులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభించారు. గవర్నర్‌కు అర్జున్‌ కుటుంబసమేతంగా స్వాగతం పలికారు.

పారిశ్రామిక రంగంలోకి యువతరం

Sarja Designs : చెన్నై సాలిగ్రామ ప్రాంతంలో తాము తప్ప అంతా సినీతారలే ఉండేవారని... ఇప్పుడు భగవంతుడు తనను రాజకీయ తారగా మార్చాడని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులూ జాతీయ, అంతర్జాతీయ వారధులేనని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో కుమార్తెను ప్రోత్సహిస్తున్నందుకు అర్జున్‌ కుటుంబసభ్యులను గవర్నర్‌ అభినందించారు. ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్‌ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సర్జా తెలిపారు. పారిశ్రామికరంగంలో యువతరం రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని తమిళిసై పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి హాజరయ్యారు.

'యువ పారిశ్రామికవేత్తలు , భారత్‌లో తయారీ విధానం ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. పర్యావరణాన్ని రక్షించాలనే అంజనా సంకల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో తనను అభినందిస్తున్నాను . యువ పారిశ్రామికవేత్తలను అందరూ ప్రోత్సహించాలి. తప్పక విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఎంతోమంది స్నేహితులు, నిపుణులు, వ్యాపారవేత్తలు తోడుగా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆ బాధ్యతను తప్పక నెరవేరుస్తావని విశ్వసిస్తున్నా.' - అర్జున్‌, నటుడు

'సేంద్రీయ పద్ధతిలో బ్యాగులను తయారుచేశాం. చైన్‌, జిప్‌ల తయారీకి వాడిన మెటీరియల్‌ను పునర్వినియోగానికి ఉపయోగించుకోవచ్చు . ఆపిల్‌, క్యాక్టసస్‌, పైనాపిల్‌ పండ్ల నుంచి వచ్చే గుజ్జుతో ఉత్పత్తులను రూపొందించాం. పండ్లు, కూరగాయలను మాత్రమే వినియోగించాం. భారత్‌లో తొలిసారిగా ఈ తరహాలో పర్యావరణహిత బ్యాగులు చేయడం గర్వంగా ఉంది.' - అంజనా, సీఈఓ సర్జా డిజైన్స్‌

పారిశ్రామిక రంగంలోకి యువతరం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details