జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తామని ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ కమిటీని ఆదేశించారు. జనవరి మూడో వారంలో వేతన సవరణను ప్రకటించనున్నారు. టీజీవో, టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. వేతనాలు పెంపు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
జనవరిలో పదోన్నతులు, ఏపీలోని ఉద్యోగులు త్వరలోనే తెలంగాణకు: కేసీఆర్ - పీఆర్సీ వార్తలు
ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను త్వరగా తమ రాష్ట్రానికి తీసుకెళతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తామని, జనవరి మూడో వారంలో వేతన సవరణను ప్రకటించనున్నట్టు ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనికి కావలసిన ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలిపారు.

జనవరిలో పదోన్నతులు, ఏపీలోని ఉద్యోగులు త్వరలోనే తెలంగాణకు
ప్రభుత్వానికి ఇవాళ వేతన సవరణ సంఘం నివేదిక ఇవ్వనుంది. పీఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వీఆర్వోలను త్వరలోనే రెవెన్యూశాఖలో సర్దుబాటు చేస్తామన్నారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను త్వరగా తమ రాష్ట్రానికి తీసుకెళతామని స్పష్టం చేశారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం జరుపుతామన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల డైరీలను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే చర్యలు