ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Liquor Shop License: మద్యం దుకాణాల లైసెన్స్​ల ఎంపిక ప్రక్రియ నేడే.. - application for liquor license

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్(Liquor Shop License)​ల ఎంపిక ప్రక్రియ ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో లైసెన్స్​(Liquor Shop License)లు ఎంపిక చేస్తారు. ఇందుకు ఎక్సైజ్​ శాఖ(telangana excise department) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్దం చేసింది.

telangana-government-selects-license-ti-liquor-shops-with-lottery-today
మద్యం దుకాణాల లైసెన్స్​ల ఎంపిక ప్రక్రియ నేడే..

By

Published : Nov 20, 2021, 8:32 AM IST

Updated : Nov 20, 2021, 9:11 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్​(Liquor Shop License)ల ఎంపిక ప్రక్రియ ఇవాళ జరగనుంది. ఇందుకు ఎక్సైజ్​ శాఖ(telangana excise department) సర్వం సిద్దం చేసింది. ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని 34 జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ఎక్షైజ్ సుపంరిండెంట్ల ద్వారా లాటరీ విధానంలో లైసెన్స్​లను ఎంపిక(wine shop licence in lottery process) చేస్తారు. జిల్లా కలెక్టర్‌ లేదా ఆయన సూచించిన అధికారి ఆధ్వర్యంలోనే లైసెన్సుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. లాటరీ ద్వారా జరగనున్న ఎంపిక ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ఎక్సైజ్​ శాఖ(telangana excise department) ఇప్పటికే సిద్ధం చేసింది. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు(application for liquor license) వచ్చిన చోట... ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లు తీసుకుని దరఖాస్తు దారులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను అధికారులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో... ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393 లెక్కన 756 దుకాణాలు ఆ మూడు వర్గాలకు కేటాయించగా.. మిగిలిన 1,834 దుకాణాలు ఓపెన్‌ క్యాటగిరిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం మొత్తం 67,849 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలు రూపాయిలు లెక్కన నాన్‌ రీఫండ్‌బుల్‌ మొత్తం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1,356.98 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

2019లో దరఖాస్తుల ద్వారా రూ.975.68 కోట్లు రాబడి వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్​ శాఖ అంచనా వేసింది. అంతకు ముందు... సగటున ఒక్కో దుకాణానికి 22 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన దుకాణాల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు. 2019-21 మద్యం విధి విధానాల ప్రకారం 2,216 మద్యం షాపులకు 49వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం విధానంలో ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు అన్న నిబంధనను తొలగించడంతో పాటు లైసెన్స్ విధానాన్ని సరళీకరణ చేశారు. ఇలా చేయడం వల్ల భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. ఇప్పుడున్న 2,216 దుకాణాలకు కొత్తగా మరో 404 దుకాణాలు అదనంగా ఏర్పాటు అవుతుండడంతో దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. కానీ.. స్పందన పెద్దగా లేకపోవటం వల్ల లక్ష లక్ష్యం కాస్తా.. 66 వేల దగ్గరే ఆగిపోయింది.

ఇవీ చూడండి:

Last Updated : Nov 20, 2021, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details