కరోనా మహమ్మారి హైదరాబాద్ మెట్రోకు శాపంగా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు ప్రజల ఆదరణ క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. వివిధ సందర్భాల్లో రికార్డుస్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad metro rail news) పేరు గాంచింది. అయితే కరోనా మహమ్మారి మెట్రోను దారుణంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్, వివిధ రంగాల కార్యకలాపాలు మందగించడం, వర్క్ ఫ్రం హోం తదితర కారణాల వల్ల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మెట్రో తిరిగి ప్రారంభమైనా ఆశించిన మేర ప్రయాణికుల సంఖ్య పెరగలేదు.
ఆర్థిక నష్టాలు.. పేరుకుపోతున్న అప్పులు
మెట్రో ఎదుర్కొంటున్న నష్టాల నుంచి గట్టెక్కించాలని ఎల్అండ్టీ సంస్థ ఎప్పట్నుంచో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. పలు దఫాలుగా సర్కారుకు విజ్ఞప్తులు(L&T appeal to the Telangana government on metro losses) చేసింది. కొవిడ్ మూలంగా వచ్చిన ఆర్థికనష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీలను దృష్టిలో ఉంచుకొని తగిన తోడ్పాటు అందించాలని కోరింది. సెప్టెంబర్ నెలలో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సంస్థ ప్రతినిధులు ఆర్థిక నష్టాలు, అప్పుల భారం, వడ్డీ చెల్లింపులు తదితరాలను వివరించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అన్ని రంగాలను ఆదుకున్న తరహాలోనే హైదరాబాద్ మెట్రోను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తామని (telangana Government reviewing on Metro train losses) హామీ ఇచ్చారు.
వెయ్యి కోట్ల సాఫ్ట్లోన్ అడుగుతున్న ఎల్ అండ్ టీ