TSPSC Notification for Police jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మొత్తం 16,027 కానిస్టేబుల్, 587 ఎస్‌ఐ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్.. ఖాళీలు ఎన్నంటే..? - TSPSC Notification for Police jobs
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం చల్లని కబురందించింది. ఉద్యోగార్థుల ఎదురు చూపులకు తెరదించుతూ.. కొలువుల ప్రకటన ఒక్కొక్కటిగా విడుదలవుతోంది. నేడో రేపో గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పగా.. తెలంగాణ పోలీస్ శాఖ ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
4,965 సివిల్ కానిస్టేబుల్, 4,423 ఏఆర్ కానిస్టేబుల్, 5,010 టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, 587 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 414 సివిల్ ఎస్సైల పోస్టులను భర్తీ చేయనుంది. 66 ఏఆర్ ఎస్సై పోస్టులు, 5 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 23 టీఎస్‌ఎస్‌పీ సబ్ ఇన్‌స్పెక్టర్, 12 ఎస్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్, 26 విపత్తు, అగ్నిమాపకశాఖలో ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 8 డిప్యూటీ జైలర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఇవీ చదవండి:సీపీఎస్‌పై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీ