పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున జమవుతాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెల్లరేషన్ కార్డుదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని ట్వీట్ చేశారు.
''కరోనా సమయంలో పేద ప్రజలకు మద్దతుగా సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినట్లు... తెలంగాణలో సుమారు 74 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నేడు రూ.1500 జమకానున్నాయి. ఇందుకోసం రూ. 1,112 కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసింది.''