గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు టీఎస్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతల సబబు కాదని లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు. తద్వారా గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ.. ఏం చెప్పిందంటే? - Telangana Government letter to Grmb news
పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతల సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై ఈ మేరకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు టీఎస్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తోందన్న ఈఎన్‌సీ.. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్తున్న ఏపీలో కొత్త ప్రాజెక్టులేంటని ప్రశ్నించింది. దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి :