monkeypox : మశూచిని పోలిఉండే వైరల్ వ్యాధి మంకీపాక్స్‌పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. 80 దేశాల్లో ఈ కేసులు నమోదవుతుండడం, వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులు మన వద్ద నమోదు కాకపోయినా, ముందు జాగ్రత్తల ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Monkeypox Cases in Telangana : ఈ కేసులు నమోదైన దేశాలకు గత మూడు వారాల్లో వెళ్లివచ్చిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే.. వారి రక్తం, లాలాజలం నమూనాలు సేకరించాలని స్పష్టం చేసింది. వాటిని పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపి పరీక్షస్తారు. సంబంధితులను ఐసోలేషన్ చేయడంతో పాటు వారు ఎవరెవర్ని కలిశారో వివరాలు సేకరించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కరోనా కేసుల్లో లానే కాంటాక్టులను గుర్తించి వారూ 21 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండేలా చూడాలంది.