సినీ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విడుదలయ్యే సినిమాలకు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సినిమా ప్రదర్శనలకు సమయాన్ని నిర్దేశించింది. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు సినిమాలను ప్రదర్శించుకోవచ్చని చెప్పింది. ఆ సమయంలోనే ఐదో ఆట కూడా ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. ఉదయం 10 గంటల కంటే ముందు అర్ధరాత్రి 1 గంటల తర్వాత ఎలాంటి సినిమా ప్రదర్శనలు ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
సినీ ప్రియులకు.. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! - radhe shyam news
తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా ప్రదర్శనలకు సమయాన్ని నిర్దేశిస్తూ.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు సినిమాలను ప్రదర్శించుకోవచ్చని చెప్పింది.
1970, 1988 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం జారీచేసిన ఉత్తర్వులు, నోటిఫికేషన్లను సవరిస్తూ తెలంగాణ సినిమా రూల్స్ 1970లో 43వ అంశాన్ని సవరిస్తూ హోంశాఖ జీవో నంబర్ 10ని జారీ చేసింది. అయితే ఈ జీవోపై తెలంగాణలోని ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాల సమయంలో ఉదయం 7 గంటలకే ప్రదర్శనలు ప్రారంభమవుతాయని, గతంలోనూ అలాగే కొనసాగించామని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల వల్ల ఉదయం 7 గంటల ప్రదర్శనలు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సినిమా ప్రదర్శన వేళల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీచూడండి:'రాధేశ్యామ్'తో ప్రభాస్ మరోసారి లవర్‌బాయ్‌గా మెప్పిస్తారా?