లాక్డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుకున్న ఏపీ సచివాలయ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. తమ ఉద్యోగులను ఏపీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. 400 మంది ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్ కోరారు. హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్ పల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, లక్డీకాపుల్, ఎల్బీ నగర్ల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఉద్యోగులు అమరావతి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్ కోరారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం కేటాయించిన 10 బస్సుల్లో రాష్ట్రానికి బయలుదేరనున్నారు.
అందరికీ పరీక్షలు చేయండి