ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Loan to Irrigation Projects: ఆ మూడు ప్రాజెక్టుల కోసం.. రూ.వెయ్యి కోట్ల రుణం!

తెలంగాణలో మూడు నీటిపారుదల ప్రాజెక్టుల(Loan to Irrigation Projects) నిర్మాణం కోసం రుణం తీసుకునేందుకు.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అనుమతిచ్చింది. వరదకాల్వ, దేవాదుల -తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల కోసం.. రూ. వెయ్యి కోట్లు రుణంగా తీసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.

By

Published : Nov 24, 2021, 6:41 PM IST

Irrigation Project
Irrigation Project

Loan to Irrigation Projects: వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ-ఎస్సార్‌ఎస్పీ), దేవాదుల తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాలకు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌) తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

వరద కాల్వకు రూ.265 కోట్లు, దేవాదుల తుపాకులగూడెం ప్రాజెక్టుకు రూ.265 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.470 కోట్ల నిధులు రానున్నాయి. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

కిస్తీల వారీగా..
వరద కాల్వ, దేవాదుల తుపాకుల గూడెం ప్రాజెక్టు రుణాన్ని 13 ఏళ్లలో, సీతారామ ప్రాజెక్టు రుణాన్ని 14 ఏళ్లలో కిస్తీల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమాఖ్య నుంచి రూ.6,998.39 కోట్ల రుణం మంజూరు కానుంది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.

ఇదీ చదవండి:Chandrababu: ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే.. ఇంత నష్టం జరిగేదా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details