ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు - schools holidays in telangana

తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ: ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
తెలంగాణ: ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు

By

Published : Apr 25, 2021, 7:26 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు... ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​, సీఎస్​, విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు.

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు.

పాఠశాలలు, జూనియర్ కళాశాలలను... ఎప్పుడు తెరిచేది కొవిడ్-19 పరిస్థితిని అనుసరించి జూన్​ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు: ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details