తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో కర్నల్ సంతోష్ బాబు మొదటి వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఆవిష్కరించారు. సంతోష్‌బాబు కుటుంబానికి టీఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని అన్నారు. ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా సంతోష్‌బాబు విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు.
KTR:'సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది' - కర్నల్ సంతోష్ బాబు వర్ధంతి
కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా సంతోష్‌బాబు విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు.
సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
కర్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరవదన్నారు. సైన్యంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచేలా సీఎం నిర్ణయం ఉందని తెలిపారు. సైన్యానికి భారత ప్రజలు అండగా ఉంటారనే సందేశాన్ని సీఎం ఇచ్చారని చెప్పారు.
ఇదీ చదవండి:Inter Exams: వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు