ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
వ్యాక్సినేషన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలని ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.