ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: వాహనంలోనే స్వర్గపురి వాహనం డ్రైవర్ మృతి - Telangana: final funeral vehicle driver died in vehicle

స్వర్గపురి వాహన డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి... అదే వాహనంలో మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చోటు చేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana:  final funeral vehicle driver died in vehicle
తెలంగాణ: వాహనంలోనే స్వర్గపురి వాహనం డ్రైవర్ మృతి

By

Published : Jun 19, 2020, 5:34 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో స్వర్గపురి వాహనం డ్రైవర్ అదే వాహనంలో మృతిచెందాడు. చనిపోయిన వారిని శ్మశానవాటికకు చేర్చే వాహనం డ్రైవర్​గా లింగస్వామి విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వెళ్లకుండా అదే వాహనంలో పడుకున్నాడు. ఉదయం కుటుంబసభ్యులు చూసే సరికి విగత జీవిగా పడి ఉన్నాడు.

మద్యం అధికంగా సేవించడం వల్ల మరణించాడా? లేక ఆర్థిక ఇబ్బందులతో విషం తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: ఎమ్మెల్యే క్వార్టర్స్​లో పేకాట రాయుళ్ల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details