ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Agriculture sprayer పురుగుమందు పిచికారీకి రైతు వినూత్న ఆవిష్కరణ - Latest News of Ap

Agriculture sprayer రైతులు అందరూ పంట మొక్కలకు వాడే పురుగు మందులను డబ్బాలో వేసి వీపున పెట్టుకొని పిచికారి చేస్తూ ఉంటారు. ఇది అందరూ కామన్​గా చేస్తున్న పని. కానీ, అందుకు భిన్నంగా ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుందని ఒక రైతు ఆలోచించాడు. అందులో విజయం సాధించి, ఇప్పుడు కర్షకులంతా తనలా ఆలోచించేలా చేస్తున్నాడు. ఇంతకీ ఏంటా ఆలోచన.

Pesticides spray Innovation
పురుగుమందు పిచికారీకి రైతు వినూత్న ఆవిష్కరణ

By

Published : Aug 22, 2022, 5:23 PM IST

Agriculture sprayer : పంట మొక్కలకు పురుగుమందు పిచికారీకి సంబంధించి తెలంగాణకు చెందిన ఓ రైతు వినూత్న ఆవిష్కరణ చేశాడు. సాధారణంగా అయితే మందు పిచికారీ డబ్బాను వీపునకు తగించుకొని రైతులు పిచికారీ చేస్తారు. కానీ నారాయణపేట జిల్లాలోని నర్వ మండలానికి చెందిన ఓ రైతు మాత్రం ఎద్దుల బండిపై ఓ మోటారును అమర్చి దాని ద్వారా పురుగుమందును పిచికారీ చేస్తున్నాడు.

రెండు పెద్ద డ్రమ్ములను ఓ ఎద్దులబండిపై ఉంచి వాటిల్లో క్రిమిసంహారక మందును నింపాడు. వాటికి మోటారును అమర్చి తద్వారా మందును మొక్కలకు పిచికారీ చేస్తున్నాడు. మామూలుగా అయితే స్ప్రేయర్‌ను రైతులు చేత్తో పట్టుకొని ఒక్కో మొక్కపై మందు పిచికారీ చేస్తూ వెళతారు. కానీ ఈ రైతు మాత్రం బండిపైనే రెండు స్ప్రేయర్లను అమర్చాడు.

అవి ఆటోమేటిక్‌గా తిరుగుతూ పిచికారీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాగా ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను నారాయణపేట కలెక్టర్‌ హరిచందన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆ రైతును ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, కూలీల అవసరం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details