కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ రాసింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఆ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. అనుమతి లేకుండానే ఏపీ ప్రాజెక్టు నిర్మిస్తోందని.. విస్తరణ పనులకు టెండర్లు పిలిచిందని పేర్కొంది. విస్తరణ పనుల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని కోరింది.
ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీల పై చిలుకు నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాడుకుంటోందని మురళీధర్ లేఖలో తెలియజేశారు. మిగులు నీటి ఆధార ప్రాజెక్టులు, అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి 3,850 క్యూసెక్కుల బదులు 6,300ల క్యూసెక్కుల వినియోగంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి పలు దఫాలుగా ఫిర్యాదులు చేసిందని వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అంశాన్ని లేఖలో పేర్కొన్నారు.
వేల కిలోమీటర్లు తరలించడం అన్యాయం
కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ నీటివాటాలను తేల్చే వరకు ఈ ప్రాజెక్టు(Handri neeva sujala sravanthi project) నుంచి ఏపీ ప్రభుత్వం నీరు తీసుకోకుండా నిలువరించాలని గతంలో తెలంగాణ.. కేఆర్ఎంబీని కోరింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆగస్టులో లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయం జలవిద్యుత్‌కు ఉద్దేశించినదేనని.. అక్కడి నుంచి కృష్ణా బేసిన్ వెలుపలకు నీటి తరలింపునకు ట్రైబ్యునల్ అనుమతించలేదని పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు(Handri neeva sujala sravanthi project) ద్వారా ఏపీ ప్రభుత్వం.. కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని అన్నారు. దీంతో బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని.. నది ఒడ్డునున్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ వెలుపల 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి(Handri neeva sujala sravanthi project) నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు కూడా చేయలేదని ఈఎన్సీ గుర్తు చేశారు. అలా నీటిని తరలించడం ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని అన్నారు. మిగులు జలాలపై ఆధారపడి బేసిన్ వెలుపలకు నీటిని తీసుకెళ్లే హంద్రీనీవా ప్రాజెక్టునే తాము వ్యతిరేకిస్తుంటే సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని తెలంగాణ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోందని.. ఆంధ్రప్రదేశ్ మాత్రం విజ్ఞప్తి చేయడం లేదని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వాటాలు ఖరారు చేసే వరకు హంద్రీనీవా(Handri neeva sujala sravanthi project) నుంచి నీటిని తరలించకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని ఆగస్టులో రాసిన లేఖలో కోరారు.
ఇదీ చదవండి
Live Video: రూ.2500 కోసం ఫ్రెండ్‌ను కత్తితో పొడిచి..