కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ రాసింది. తాగునీటి వినియోగం, లెక్కింపుపై ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటి వినియోగాన్ని20 శాతంగా లెక్కించాలని ఈఎన్‌సీ లేఖలో కోరింది.
ENC Letter : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ - తెలంగాణ తాజా వార్తలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ రాసింది. 2051 నాటి జనాభా అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు కృష్ణాలో 75.32 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ కోరుతున్నామనిపేర్కొంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
15 శాతంగానే లెక్కించాలని ఇటీవల సీడబ్ల్యూసీ పేర్కొందని.. 2051 నాటి జనాభా అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు కృష్ణాలో 75.32 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ కోరుతున్నామని ఈఎన్‌సీ పేర్కొంది. 75.32 టీఎంసీల్లో 20 శాతాన్ని తాగునీటిగా లెక్కించాలని.. 20శాతం ప్రకారం 15.06 టీఎంసీలను తాగునీటిగా పరిగణించాలని ఈఎన్‌సీ కోరింది.
ఇదీ చూడండి:Badvel by-poll: బద్వేలు ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్