ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Solicitor General సొలిసిటర్‌ జనరల్‌ ముందు తెలంగాణ విద్యుత్తు బకాయిల దస్త్రం - సీఎం జగన్​ను కలిసిన సొలిసిటర్‌ జనరల్‌

Solicitor General తెలంగాణ డిస్కంలు ఏపీకి బకాయిల చెల్లింపునకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం సొలిసిటర్‌ జనరల్‌ వద్ద ఉన్నట్లు కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు. తెలంగాణ చెల్లించాల్సిన బకాయిల గురించి తమ మంత్రిత్వశాఖ పరిశీలించిందని స్పష్టం చేశారు. డిస్కంల బకాయిల గురించి కేంద్రం సరైన సమాచారం వెల్లడించడంలేదని అన్నారు.

Solicitor General
సీఎం జగన్‌తో కేంద్ర విద్యుత్తు మంత్రి భేటీ

By

Published : Aug 23, 2022, 8:32 AM IST

Updated : Aug 23, 2022, 9:30 AM IST

Solicitor General కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్​కే సింగ్​తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఏపీ విద్యుత్తు వ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ నుంచి పెద్దమొత్తంలో ఏపీకి రావాల్సిన బకాయిల గురించి ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ చెల్లించాల్సిన బకాయిల గురించి తమ మంత్రిత్వశాఖ పరిశీలించిందని స్పష్టం చేశారు. సంబంధిత దస్త్రం ప్రస్తుతం సొలిసిటర్‌ జనరల్‌ వద్ద ఉందన్నారు. చట్టం ప్రకారం ఆ బకాయిలను చెల్లించాల్సి ఉన్నట్లు తాము నమ్ముతున్నామని తెలిపారు. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ సమస్య చాలా రోజులుగా ఉన్నట్లు తనకు తెలుసన్నారు.

డిస్కంల బకాయిల గురించి కేంద్రం సరైన సమాచారం వెల్లడించడంలేదని, కేంద్ర వెబ్‌సైట్‌లో తప్పులున్నట్లు తెలంగాణ పేర్కొన్న విషయమై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘మా వైపు ఎలాంటి పొరపాట్లూ లేవు. వ్యవస్థ పక్కాగా పనిచేస్తోంది. ఎవ్వరికీ ఎలాంటి పొరపాట్లూ కనిపించలేదు’ అన్నారు. తాము వాడుకున్న విద్యుత్తుకు సంబంధించి 75 రోజులకు మించి బకాయిలను చెల్లించని డిస్కంలను మాత్రమే ఎక్స్ఛేంజిల నుంచి విద్యుత్తు కొనుగోళ్లను బంద్‌ చేసినట్లు స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2022, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details