తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండాలోని వైకుంఠధామంలో ఓ గది నిర్మిస్తున్నారు. నిర్మాణం దాదాపు పూర్తవగా... గది తలుపు మూయకపోగా ఓ కుక్క అందులోకి దూరింది. గాలికి ఆ గది తలుపు మూసుకుపోయింది. భయపడిన కుక్క.. తలుపును తీసేందుకు ప్రయత్నించగా గడియ పడిపోయింది.
తెలంగాణ: ‘లాక్’ డౌన్ విధించుకున్న శునకం - Telangana: Dog went under “lock” down
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలందరూ స్వీయ పరిరక్షణే మేలు అనుకుని ఇళ్లలోనే ఉంటున్నారు. కొవిడ్కే భయపడిందో.. లేక అందరిలానే తాను వెళ్లాలనుకుందో కానీ.. ఓ కుక్క స్వీయనిర్బంధంలోకి వెళ్లింది. వినడానికి విచిత్రంగా ఉందా.. మరి అదేంటో చూడండి..
తెలంగాణ: ‘లాక్’ డౌన్ విధించుకున్న శునకం
గదిలో అరుస్తున్న కుక్కను గమనించిన స్థానికులు తలుపు తెరిచేందుకు చూశారు. కిటికిలోంచి చూసి విషయాన్ని పసిగట్టారు. వెంటనే నిచ్చెనలు తెచ్చి కిటికీ ఆధారంగా పొడవాటి కట్టెల, ఇనుప చువ్వల సాయంతో నేర్పుగా గడియ తీశారు. తలుపు తెరుచుకోవడంతో బతుకు జీవుడా అనుకుంటూ కుక్క బయటికి పరుగు తీసింది.
ఇవీ చదవండి: ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సీఎం అబాసుపాలు: చినరాజప్ప