ఏపీ నుంచి వెళ్లే కొవిడ్ అంబులెన్స్‌లు అడ్డగింత - ap latest news
10:11 May 10
కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు
రాష్ట్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కొవిడ్ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు.
ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్ రోగులకు రాష్ట్రంలోకి అనుమతి లేదని.. మరోవైపు హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్ లేవని పోలీసులు చెబుతున్నారు. పుల్లూరు టోల్‌గేట్ వద్దకు కర్నూలు పోలీసులు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. ఆస్పత్రుల హామీతో అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి:వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం!