ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో పెరిగిన విద్యుత్​ ఛార్జీలు.. అమలు అప్పట్నుంచే!

Current Charges Hike in Telangana: తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు యూనిట్‌పై 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెరగనుంది. ఈ పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

విద్యుత్‌ ఛార్జీల పెంపు
విద్యుత్‌ ఛార్జీల పెంపు

By

Published : Mar 23, 2022, 5:29 PM IST

Current Charges Hike in Telangana: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌పై 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెరగనుంది. ఈ పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మీడియా సమావేశంలో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్‌ టి.శ్రీరంగారావు వెల్లడించారు.

డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుందని ఈఆర్సీ ఛైర్మన్‌ తెలిపారు. 2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ రూ.16వేల కోట్లని చెప్పారు. కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్‌ ఆమోదించిందని వివరించారు.

ఇదీ చదవండి :నందిగామ పరిధిలో.. పన్ను కట్టనివారి ఆస్తులు సీజ్!

ABOUT THE AUTHOR

...view details