ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ-పాస్ ఉండాల్సిందే.. లేకుంటే అనుమతించం: తెలంగాణ డీజీపీ - తర రాష్ట్రాల వాహనాలకు ఈ-పాస్

తెలంగాణలోకి వచ్చే ఇతర రాష్ట్రాల వాహనాలకు ఈ-పాస్ ఉండాలని, లేకుంటే అనుమతించమని....డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారన్న వార్తలపై...డీజీపీ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

Telangana DGP
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

By

Published : May 25, 2021, 6:50 AM IST

తెలంగాణలోకి ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలకు సంబంధిత రాష్ట్రాలు జారీచేసిన ఈ-పాస్ ఉండాలని, లేకుంటే అనుమతించమని..డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రోగులతో వచ్చే అంబులెన్సులకు..ఎలాంటి అనుమతి అవసరం లేదని పునరుద్ఘాటించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారన్న వార్తలపై...డీజీపీ ఈ మేరకు వివరణ ఇచ్చారు. జాతీయ రహదారులపై అన్నిరకాల రవాణా వాహనాలు అనుమతిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ సందర్భంగా... ట్రాఫిక్ నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి వివరించారు

పోలీసు శాఖ జారీ చేస్తోన్న ఈ-పాసులు తమకు అందడం లేదంటూ.. పలువురు నెటిజన్లు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వాళ్ల దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారని.. ట్విట్టర్ ద్వారా మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. వరుస ఫిర్యాదులపై స్పందించిన ఉన్నతాధికారి.. సమస్యను పరిష్కరించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details