తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
రాజకీయ నాయకుల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని డీజీపీ తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.