ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS COVID: తెలంగాణలో తగ్గుతున్న కొవిడ్ కేసులు.. కొత్తగా 449 మందికి పాజిటివ్​ - తెలంగాణలో తగ్గుతున్న కొవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్​ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 449 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వైరస్​ బారినపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో కొత్తగా 449 మందికి పాజిటివ్​
తెలంగాణలో కొత్తగా 449 మందికి పాజిటివ్​

By

Published : Aug 8, 2021, 9:03 PM IST

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా.. 449 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది.

తాజాగా మహమ్మారికి ఇద్దరు బలి కాగా.. మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది. వైరస్​ బారినుంచి మరో 623 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,406 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details